ప్యారడైజ్ టీమ్ ఎందుకు భయపడుతోంది?
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ప్యారడైజ్’. ఈ మూవీపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఏ కంటెంట్ అయినా నేషనల్ లెవెల్‌లో బ్లాస్ట్ అవుతూ వచ్చింది.
ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి కేవలం ఒక టీజర్, రెండు సాంగ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ అవి రిలీజ్ అయిన తర్వాత మిలియన్ల కొద్దీ వ్యూస్ పొందుతూ సోషల్ మీడియాలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి చూసుకోవచ్చు.. ఈ మూవీపై ఏ స్థాయిలో క్రేజ్ నెలకొంది అనేది.
అయితే, ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ అయినా కూడా ఓపెనింగ్స్ పరంగా మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కానీ అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా.. ఈ మూవీ విషయంలో ఎందుకు భయం కనిపిస్తోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌ను బట్టి చూస్తే ఇది అర్థమవుతుంది. ప్రెస్‌మీట్‌లో హీరో, డైరెక్టర్, నిర్మాత.. ఈ ముగ్గురి మొహాల్లో కూడా ఏ మాత్రం సంతోషం కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మరి ఎందుకు వారి ఫేస్‌లో ఆనందం లేదు అనే విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ మూవీ చాలా సార్లు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. గత ఏడాదే రిలీజ్ కావాల్సినప్పటికీ, ఇప్పటి వరకు ప్రతిసారీ రీషూట్స్ కారణంగా ఏదో ఒక విధంగా మూవీ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది.
కానీ ఫైనల్‌గా సెప్టెంబర్ 24న ఈ మూవీని రిలీజ్ చేయడానికి మేకర్స్ ఫిక్స్ అయ్యారు. రిలీజ్‌కు మరో పది రోజులు మాత్రమే ఉండగా, ఇప్పటికీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు.
సో, మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కథ పరంగా ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఆ కథ ఏమిటంటే.. ఇది తల్లి కొడుకుల కథ అని ఇప్పటికే మూవీకి సంబంధించి కోర్ పాయింట్‌ను డైరెక్టర్ రివీల్ చేశారు.
ఈ పాయింట్ విన్న తర్వాత చాలామందికి వచ్చిన డౌట్ ఏమిటంటే.. ‘అతసరాల’లో కొత్త సారు కొన్నట్లుగా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడా అనే సందేహాలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకులకు ఇలాంటి స్టోరీ ఎప్పటి నుంచో విన్నామనే భావన కలుగుతుంది అనేది చాలామంది అభిప్రాయం.
అది కూడా నిజమే అనుకోండి. కానీ డైరెక్టర్ కథనం ఎలా ఉంటుందనేదే ఇక్కడ మెయిన్ పాయింట్.
శ్రీకాంత్ ఓదెల గత చిత్రం చూసుకున్నట్లయితే.. ‘దసరా’ నానితోనే తెరకెక్కించారు. అది కూడా ఓల్డ్ టెంప్లేట్ అయినప్పటికీ, రూరల్ నేటివిటీకి తగ్గట్టుగా ఆ సినిమాను తెరకెక్కించడంతో హిట్ కొట్టి తన ఖాతాలో మొదటి హిట్‌ను వేసుకున్నాడు.
కానీ ‘ప్యారడైజ్’ విషయానికి వస్తే అందుకు పూర్తిగా భిన్నం. హీరో సేమ్ అయినప్పటికీ, కథ కూడా పాతదే. కానీ తెరకెక్కించే విధానంలో, హీరో గెటప్‌లోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్.
కేవలం కథనంపైనే ముందుకు వెళ్తే మూవీ బ్లాక్‌బస్టర్ కొట్టే అవకాశం ఉంది. కథ కూడా ప్రేక్షకులకు నచ్చాలి. పాత కథ అయినప్పటికీ కట్టిపడేసేలా ఆ కథను చెబితే కచ్చితంగా హిట్ అవుతుంది.
మరి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా మూవీ టీంలో ఎందుకు భయం కనిపిస్తోంది?
మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయో అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్.





కామెంట్‌లు లేవు