3,500 పోస్టులు.. బ్యాంకు నుండి భారీ నోటిఫికేషన్!

 

canara bank apprentice recruitment 3500 posts notification

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే నిరుద్యోగ యువతకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్ (Canara Bank) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖలలో అప్రెంటిస్ చట్టం కింద గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 3,500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.


పోస్టుల వివరాలు & కేటాయింపు

సంస్థ పేరు: కెనరా బ్యాంక్ (Canara Bank)

పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Graduate Apprentice)

మొత్తం ఖాళీలు: 3,500 పోస్టులు

స్టైపెండ్: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 16,650 చొప్పున స్టైపెండ్ అందిస్తారు.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం (1 Year)


అర్హతలు & వయోపరిమితి

విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి (రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).


ఎంపిక విధానం (Selection Process)

బ్యాంక్ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లేదా స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్ష (Local Language Test), డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాల్సి ఉంటుంద

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 1

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 17

అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.


ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్ (NATS) సందర్శించండి. సంబంధిత నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేసి ప్రాథమిక రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. మీ విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలను నమోదు చేసి అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి. చివరగా దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్ అవసరాల కోసం ప్రింటవుట్ కాపీని భద్రపరుచుకోండి.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.