Home loan: తక్కువ వడ్డీతో లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవే!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. అయితే ప్రస్తుత కాలంలో ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు చాలావరకు బ్యాంక్ హోంలోన్లపైనే ఆధారపడాల్సి వస్తుంది. హోంలోన్ తీసుకునేటప్పుడు మనం ప్రధానంగా చూడాల్సింది వడ్డీ రేటు. వడ్డీ రేటులో కేవలం 0.10% లేదా 0.20% తేడా వచ్చినా, దీర్ఘకాలికంగా చూస్తే లక్షల రూపాయల EMI భారం తగ్గుతుంది. ప్రస్తుతం రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు గృహ రుణం (Home Loan) తీసుకోవాలనుకునే వారి కోసం పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో అత్యల్ప వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకుల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
ప్రభుత్వ రంగ (పబ్లిక్ సెక్టార్) బ్యాంకుల్లో వడ్డీ రేట్లు:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra): 7.00%
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India): 7.00%
బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India): 7.10%
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా / LIC హౌసింగ్ ఫైనాన్స్: 7.15%
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda - BOB): 7.20%
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) / పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): 7.25%
ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank): 7.40%
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు:
వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్, తక్కువ డాక్యుమెంటేషన్ కోరుకునేవారు ప్రైవేట్ బ్యాంకులను సంప్రదిస్తుంటారు. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు చూసినట్లయితే.. సౌత్ ఇండియన్ బ్యాంక్ (South Indian Bank): 7.25%, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ (HSBC): 7.45%, ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank): 7.50%.
హోంలోన్ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు:
* సిబిల్ స్కోర్ (CIBIL Score): పైన పేర్కొన్న అత్యల్ప వడ్డీ రేట్లు ప్రధానంగా 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికే వర్తిస్తాయి. క్రెడిట్ స్కోర్ తగ్గితే వడ్డీ రేటు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.
* ప్రాసెసింగ్ ఫీజు & ఇతర ఛార్జీలు: కేవలం వడ్డీ రేటు మాత్రమే కాకుండా బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ మరియు లీగల్ ఛార్జీలను కూడా సరిచూసుకోవాలి.
* రీపేమెంట్ వ్యవధి (Tenure): లోన్ వ్యవధి పెరిగే కొద్దీ నెలవారీ EMI తగ్గుతుంది కానీ, మొత్తం చెల్లించే వడ్డీ భారం పెరుగుతుంది. కాబట్టి మీ ఆదాయానికి తగినట్లు సరైన వ్యవధిని ఎంచుకోవడం మంచిది.
