SSC NOTIFICATION: 2536 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి!

 

SSC CHSL Recruitment Notification DEO LDC Jobs Details

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం సాధించాలనుకునే యువతకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మంచి అవకాశాన్ని కల్పించింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL - 10+2) పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,536 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 7 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


ముఖ్యమైన పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో క్రింది విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.


విద్యార్హతలు:

LDC / JSA పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. DEO పోస్టులకు సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, అందులో మ్యాథమెటిక్స్ (గణితం) ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

వయోపరిమితి:

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాతపరీక్షల ఆధారంగా జరుగుతుంది:

టైర్-1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ - CBT)

టైర్-2 (మెయిన్స్ పరీక్ష & స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్)

దరఖాస్తు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 7.

అధికారిక వెబ్‌సైట్: ssc.gov.in

Blogger ఆధారితం.