ఓర్వకల్లులో విషాదం.. పిడుగు పడి కూలీలు మృతి

Nandyal district Orvakal lightning strike tragedy two women dead


 నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కూలీలపై పిడుగుపడటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఓర్వకల్లు మండలం పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలోని ఓ టమాటా పొలంలో కూలీలు పనులు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఏర్పడి పొలంపై పిడుగుపడింది. ఈ ఘటనలో పనుల్లో ఉన్న మృత్తుజా బీ (64), పింజరి బీబీ (56) తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. వీరిద్దరూ వరుసకు వదిన, మరదలు అవుతారని స్థానికులు పేర్కొన్నారు.

పిడుగుపాటు తీవ్రతకు అక్కడే ఉన్న రియాజ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి కూలీలు, రైతులు వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.