నందమూరి కుటుంబం ఎన్టీఆర్‌ను దూరం పెట్టిందా? ఆయన మాటల్లోనే..

 

jr ntr emotional speech first movie opening shot nandamuri family analysis

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత పబ్లిక్ మూవీ ఫంక్షన్ లో మెరిశారు. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ' మూవీ ఫంక్షన్ కి ముఖ్యఅతిథిగా వచ్చారాయన. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త చర్చలకు దరితీస్తున్నాయి. తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్.


ఆ ముహూర్తం షాట్.. 17 ఏళ్ల కుర్రాడి ఒంటరి ప్రయాణం

ఆయన హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఆ సినిమా ప్రారంభోత్సవం రోజు తారక్ అనుభవించిన ఒంటరితనాన్ని గుర్తుచేసుకుంటూ "తొలి సినిమా ఓపెనింగ్ షాట్‌కు తోడుగా రమ్మని అమ్మను అడిగాను. కానీ అమ్మ రాలేదు. నాన్న హరికృష్ణగారికి చెబితే.. 'నీ కాళ్లపై నువ్వే నిలబడాలి, నీ ప్రయాణం నువ్వే సాగించాలి' అని తేల్చి చెప్పారు. దాంతో ఆ ముహూర్తం షాట్‌‌కు ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది.." అంటూ అప్పటి ఒంటరితనం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు తారక్ ముఖంలో నవ్వు ఉన్నా, లోపల దాచుకున్న బాధ, చిన్న వయసులో ఎదుర్కొన్న నిస్సహాయత స్పష్టంగా కనిపించాయి.


నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టిందా?

తారక్ సినీ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి నేటి వరకు ఇండస్ట్రీ వర్గాల్లో "నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్‌ను దూరం పెట్టిందా?" (Nandamuri Family and Jr NTR Gap). తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది.


బాబాయి బాలకృష్ణతో విభేదాల వార్తలు (Balakrishna Jr NTR Controversy):

2009 ఎన్నికల్లో పార్టీ కోసం తీవ్రంగా ప్రచారం చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ తర్వాత కుటుంబ వేడుకల్లో గానీ, పార్టీ వ్యవహారాల్లో గానీ తారక్‌ను పక్కన పెట్టారనే ప్రచారం బలంగా సాగింది. బాబాయి బాలకృష్ణతో కూడా మాటలు లేవని, ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లూ ఈ వివాదాలపై బయట వ్యక్తులు మాత్రమే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు స్వయంగా ఎన్టీఆరే తన తొలి అడుగుల సమయంలో కుటుంబం నుంచి ఎలాంటి తోడ్పాటు అందలేదని, ఒంటరిగానే కెమెరా ముందుకు వెళ్లానని చెప్పడం ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతోంది.


వారసత్వ గుర్తింపు కోసం సుదీర్ఘ పోరాటం:

సీనియర్ ఎన్టీఆర్ పోలికలు, ఆయన వాక్చాతుర్యం అన్నీ ఉన్నప్పటికీ.. కెరీర్ ఆరంభంలో తారక్‌కు కుటుంబం నుంచి సరైన వెన్నుదన్ను లభించలేదన్నది కాదనలేని నిజం. రామోజీరావుగారు 'నిన్ను చూడాలని' ద్వారా అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి' చిత్రాలతో తారక్ తన స్వయంకృషితోనే తిరుగులేని స్టార్‌గా నిలబడ్డారు. ఎవరి సిఫార్సులూ లేకుండా, కేవలం తన అసాధారణ నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీతోనే టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. చివరకు 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని 'గ్లోబల్ స్టార్'గా అవతరించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.