రెండు భాగాలుగా 'రాక'.. రిలీజ్ ఎప్పుడంటే!

 

Allu Arjun and Director Atlee movie Raaka to release in two parts

పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ రేంజ్‌లో అడుగులు వేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘రాక’ (Raaka) పై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సన్ పిక్చర్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఫిలిం సర్కిల్స్‌‌లో ఒక ఆసక్తికర వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ విజువల్ వండర్‌‌ను రెండు భాగాలుగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.


రెండు భాగాల వెనుకున్న ప్లాన్ అదే

కథ విస్తృతి చాలా పెద్దదిగా ఉండటంతో పాటు కమర్షియల్ లెక్కల కారణంగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ఓటీటీ (OTT) హక్కులు, భారీ ఎత్తున థియేట్రికల్ బిజినెస్ మరియు వరల్డ్ వైడ్ శాటిలైట్ రైట్స్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మొదటి భాగాన్ని 2027 లో గ్రాండ్ గా విడుదల చేసి రెండో భాగాన్ని 2028లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట.

Read also: 'గరుడ' ఫిక్స్.. జక్కన్న నెక్ట్ ఎన్టీఆర్ తోనే?

అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత

షూటింగ్ ప్రారంభమైన నాటి నుంచి సెట్స్ నుంచి ఏ ఒక్క చిన్న లీక్ కూడా బయటకు రాకుండా చిత్ర బృందం అత్యంత పగడ్బందీగా వ్యవహరిస్తోంది. అసలు సినిమా కథా నేపథ్యం ఏమిటి? అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై పూర్తి గోప్యత పాటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌తోనే సరికొత్త లుక్‌ను పరిచయం చేసి అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించారు. ఆ తర్వాత నుండి సినిమాపై ఎలాంటి లీక్స్ రాకుండా మేకర్స్ తీసుకుంటున్న జాగ్రత్తలు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.


రిలీజ్‌కు ముందే గిన్నిస్ రికార్డ్!

సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే ‘రాక’ ప్రాజెక్ట్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అత్యాధునిక హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో ఏకకాలంలో అత్యధిక మందికి మోషన్ క్యాప్చర్ (Motion Capture) నిర్వహించి ఈ చిత్రం అధికారికంగా ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే విడుదల కాకముందే గిన్నిస్ రికార్డ్ సాధించిన చిత్రంగా నిలిచి గ్లోబల్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.